- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈ రోజు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,08,800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.600 తగ్గి రూ.1,08,200గా ఉంది. అలాగే నిన్న రూ.1,18,690 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.650 తగ్గి రూ.1,18,040గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.3000 తగ్గి కిలో రూ.1,61,000గా చేరి ఆల్ టైమ్ రికార్డులకెక్కాయి. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,08,200
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,18,040
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,08,200
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,18,040






