Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని ఊపిరి పీల్చు కుంటున్నారు. ఈ క్రమంలో నేడు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,05,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.850 తగ్గి రూ.1,04,900గా ఉంది. అలాగే నిన్న రూ.1,15,370 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.930 తగ్గి రూ.1,14,440గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,50,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,04,900

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,14,440

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,04,900

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,14,440

Next Story