- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే..?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో భారీగా పెరిగి తులం 95వేల వరకు వచ్చింది, కానీ నిన్నటి నుంచి గోల్డ్ ధరలు తగ్గు ముఖం కనబడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనడానికి ప్రజలు బంగారం షాపులకు పరుగులు పెడుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.900 కు తగ్గి రూ.83,100 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.980 కు తగ్గి రూ.90,660 గా ఉంది. ఇక వెండి ధరలు 5000 వేలు తగ్గి కిలో రూ. 1,03,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.83,100
24 క్యారెట్ల బంగారం ధర - రూ.90,660
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.83,100
24 క్యారెట్ల బంగారం ధర – రూ.90,660
Read More..
Gold rates: భారీగా పతనమైన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!






