- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం, వెండి ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,14,650 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.100 తగ్గి రూ.1,14,550గా ఉంది. అలాగే నిన్న రూ.1,,25,080 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.110 తగ్గి రూ.1,24,970కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.2000 తగ్గి కిలో రూ.1,73,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,14,550
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,24,970
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,14,550
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,24,970






