Today Gold, Silver Rates: బిగ్ షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-10-15 04:43:19  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold, Silver Rates: బిగ్ షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత ఇరవై రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు కూడా భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,17,650 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.500 పెరిగి రూ.1,18,150గా ఉంది. అలాగే నిన్న రూ.1,28,350 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.540 పెరిగి రూ.1,28,890కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.1000 పెరిగి కిలో రూ.2,07,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,18,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,28,890

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,18,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,28,890

Next Story