Today Gold, Silver Rates: మహిళలకు బిగ్ షాకింగ్ న్యూస్.. నేడు ఆల్ టైమ్ రికార్డుకెక్కిన ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold, Silver Rates: మహిళలకు బిగ్ షాకింగ్ న్యూస్.. నేడు ఆల్ టైమ్ రికార్డుకెక్కిన ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ మధ్యలో ఓ మూడు రోజులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ గత నాలుగు రోజుల నుంచి గోల్డ్ రేట్స్ ఇంక్రీస్ అయ్యి మహిళలకు అండ్ పసిడి ప్రియులకు బిగ్ షాకిస్తున్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,05,850 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.850 పెరిగి రూ.1,06,700గా ఉంది. అలాగే నిన్న రూ.1,15,480 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.920 పెరిగి రూ.1,16,400గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 పెరిగి కిలో రూ.1,60,000గా చేరి ఆల్ టైమ్ రికార్డులకెక్కాయి. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,06,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,16,400

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,06,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,16,400

Next Story