- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold, Silver Rates: మహిళలకు బిగ్ షాక్.. ఒక్క రోజులో మూడు వేలు పెరిగిన ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో హమ్మయ్య అని పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ గత రెండు రోజుల నుంచి మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,02,800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.400 పెరిగి రూ.1,03,200గా ఉంది. అలాగే నిన్న రూ.1,12,150 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.430 పెరిగి రూ.1,12,580గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.3000 పెరిగి కిలో రూ.1,48,000గా ఉంది. కాగా నాలుగు రోజుల్లోనే వెండి ధరలు ఏడు వేలు పెరగడం గమనార్హం. దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,03,200
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,12,580
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,03,200
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,12,580






