Today Gold Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు మాత్రం పసిడి ధరలు కాస్త తగ్గి సామాన్యులకు ఊరటనిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,01,900 ఉంది. అలాగే నిన్న రూ.1,11,170గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 తగ్గి రూ.1,11,160గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,43,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,900

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,11,160

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,900

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,11,160

Next Story