Today Gold Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో హమ్మయ్య అని పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ గత రెండు రోజుల నుంచి మళ్లీ బంగారం ధరలకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,02,800గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,12,150గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,45,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,02,800

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,12,150

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,800

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,12,150

Next Story