Today Gold Rates: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-10-27 05:31:51  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే నేడు బంగారం ధరలు భారీగా తగ్గి పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,15,150 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1050 తగ్గి రూ.1,14,100గా ఉంది. అలాగే నిన్న రూ.1,25,620 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1140 తగ్గి రూ.1,24,480కు చేరుకుంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,70,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,14,100

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,24,480

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,14,100

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,24,480

Next Story