- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: షాకింగ్ న్యూస్.. పిటి ఉషా కన్నా ఫాస్టుగా పరుగెడుతున్న బంగారం ధరలు.. ఏకంగా రూ.2000కు పైగా పెరిగి..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఓ సారి లక్ష దాటి షాక్ ఇచ్చిన పసిడి ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. కానీ మరోసారి నిన్న భారీగా రేట్లు పెరిగి మరోసారి లక్ష దాటింది. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,000 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.1950 పెరిగి రూ.92,950 ఉంది. అలాగే నిన్న రూ.99,280 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.2120 పెరిగి రూ.1,01,400 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ.1100 పెరిగి కిలో రూ. 1,20,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,950
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,400
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,950
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,400






