Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగి షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.97,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.200 పెరిగి రూ.97,250 ఉంది. అలాగే నిన్న రూ.1,05,880 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.210 పెరిగి రూ.1,06,090గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 పెరిగి కిలో రూ.1,36,100గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.97,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,06,090

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.97,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,06,090

Next Story