Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ గత రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిన్నటి నుంచి మళ్లీ గోల్డ్ రేట్స్ ఇంక్రీస్ అయ్యి మహిళలకు అండ్ పసిడి ప్రియులకు బిగ్ షాకిస్తున్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,05,300 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.550 పెరిగి రూ.1,05,850గా ఉంది. అలాగే నిన్న రూ.1,14,880 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.600 పెరిగి రూ.1,15,480గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.6000 పెరిగి కిలో రూ.1,59,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,05,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,15,480

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,05,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,15,480

Next Story