- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. రెండో రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో భారీగా పెరిగి తులం 95 వేల వరకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు నిన్న ఆల్ టైమ్ గరిష్టంగా పెరిగాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలు అమ్మో అనుకుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.1850 కు పెరిగి రూ.87,450 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.2020 కు పెరిగి రూ.95,400 గా ఉంది. ఇక వెండి ధరలు 1000 పెరిగి కిలో రూ. 1,08,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.87,450
24 క్యారెట్ల బంగారం ధర - రూ.95,400
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.87,450
24 క్యారెట్ల బంగారం ధర – రూ.95,400






