Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి లక్ష దాటిన 10గ్రాముల బంగారం ధర..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-12 07:03:05  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి లక్ష దాటిన 10గ్రాముల బంగారం ధర..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నటి నుంచి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నేడు 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,00,210 కొనసాగుతోంది. ఇక ఇటు వెండి ధర కిలో రూ. 1,08,700గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా మధ్య ప్రాచ్యంలో ఉద్రికత్తలు, డాలర్ స్వల్పంగా బలపడిన నేపథ్యంలో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,00,210

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,00,210

Next Story