- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5 రోజుల్లో 5వేలు తగ్గిన బంగారం.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల లక్షా 30వేల మార్క్ దాటిపోగా మళ్లీ రూ.10వేల వరకు తగ్గాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గటంతో దేశీయంగా కూడా తగ్గుతున్నట్టు మార్కెట్ నిపుణులు

దిశ, వెబ్ డెస్క్: బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల లక్షా 30వేల మార్క్ దాటిపోగా మళ్లీ రూ.10వేల వరకు తగ్గాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గటంతో దేశీయంగా కూడా తగ్గుతున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గత ఐదు రోజుల్లో బంగారం పది గ్రాములపై రూ.5వేల వరకు తగ్గింది. మంగళవారం 10గ్రాములపై రూ.1740 తగ్గగా, కిలో వెండిపై రూ.5వేల వరకు తగ్గింది.
ఇక నేడు ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,23,650గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10మేర తగ్గి రూ.1,13,340గా ఉంది. కిలో వెండి రూ.5వేల వరకు తగ్గి రూ.1,61,900గా ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,650గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,340గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,69,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,13,340గా ఉంది. వెండి కేజీ ధర రూ.1,69,900గా ఉంది.






