- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గోల్డ్ రేట్స్ ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని సామాన్యులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి పసిడి ధరలు కాస్త తగ్గి సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,02,400 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.500 తగ్గి రూ.1,01,900గా ఉంది. అలాగే నిన్న రూ.1,11,710గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.540 తగ్గి రూ.1,11,170గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1000 తగ్గి రూ.1,41,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,900
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,11,170
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,900
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,11,170






