Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో భారీగా పెరిగి తులం 95వేల వరకు వచ్చింది, కానీ నిన్నటి వరకు గోల్డ్ ధరలు తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.250కు తగ్గి రూ.82,850 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.280కు తగ్గి రూ.90,380 గా ఉంది. ఇక వెండి ధరలు స్థిరంగా కిలో రూ. 1,03,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.82,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ.90,380

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.82,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ.90,380

Next Story