Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గోల్డ్ రేట్స్ ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని సామాన్యులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు పసిడి ధరలు కాస్త తగ్గి సామాన్యులకు ఊరటనిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,02,600 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.200 తగ్గి రూ.1,02,400గా ఉంది. అలాగే నిన్న రూ.1,11,930గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.220 తగ్గి రూ.1,11,710గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.2000 తగ్గి రూ.1,42,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,02,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,11,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,11,710

Next Story