Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ.

Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత ఇరవై రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నటి నుంచి కాస్త తగ్గుముఖం పడ్డాయి. దీంతో పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్‌గా ఉంది. ఈ క్రమంలో నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,13,400 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 తగ్గి రూ.1,13,390గా ఉంది. అలాగే నిన్న రూ.1,23,710 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.10 తగ్గి రూ.1,23,700కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.100 పెరిగి కిలో రూ.1,84,100గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,13,390

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,23,700

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,13,390

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,23,700

Next Story