Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఓ సారి లక్ష దాటి షాక్ ఇచ్చిన పసిడి ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. కానీ గత రెండు రోజులుగా భారీగా పెరుగి మరోసారి లక్ష దాటిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఈ క్రమంలో నేడు గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.93,200 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.150 తగ్గి రూ.93,050గా ఉంది. అలాగే నిన్న రూ.1,01,680గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై రూ.170 తగ్గి నేడు రూ.1,01,510 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 తగ్గి కిలో రూ. 1,19,800కు చేరుకుంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.93,050

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,510

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,050

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,510

Next Story