Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ.

Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కాస్త రిలీఫ్ ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.93,150 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.100 తగ్గి రూ.93,050గా ఉంది. అలాగే నిన్న రూ.1,01,620 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి నేడు రూ.1,01,510గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 పెరిగి కిలో రూ.1,31,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.93,050

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,510

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,050

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,510

Next Story