Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-22 05:02:26  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని అనుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బంగారం ధరలు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. కానీ పెరిగినట్టే పెరిగి ఈరోజు స్వల్పంగా తగ్గి రిలీఫ్ ఇచ్చాయి పసిడి ధరలు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,300గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.150 తగ్గి రూ.92,150గా ఉంది. అలాగే నిన్న రూ.1,00,750 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.220 తగ్గి రూ.1,00,530గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.2000 పెరిగి కిలో రూ.1,28,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,00,530

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,00,530

Next Story