Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..?

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అలా గత కొన్ని రోజులుగా లక్ష మార్కును దాటిన పసిడి ధరలు సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. అయితే వారం రోజులుగా పెరుగుతున్న ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని పసిడి ప్రియులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.93,350 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.50 తగ్గి రూ.92,300గా ఉంది. అలాగే నిన్న రూ.1,00,750 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.60 తగ్గి నేడు రూ.1,00,690 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 తగ్గి కిలో రూ.1,19,900గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,00,690

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,00,690

Next Story