Today Gold Rates: రెండో రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధరలు.. రూ.3,100 పైగా..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-07 09:18:05  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: రెండో రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధరలు.. రూ.3,100 పైగా..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,250 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.500 పెరిగి రూ.90,750 ఉంది. అలాగే నిన్న రూ.98,460 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.540 పెరిగి రూ.99,000 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ.3,100 పెరిగి కిలో రూ. 1,11,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,000

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,000

Next Story