Today Gold Rates: నాలుగో రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-17 14:40:27  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ.

Today Gold Rates: నాలుగో రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఓ సారి లక్ష దాటి షాక్ ఇచ్చిన పసిడి ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. కానీ మరోసారి నిన్న భారీగా రేట్లు పెరిగి మరోసారి లక్ష దాటింది. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,950 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.250 పెరిగి రూ.93,200 ఉంది. అలాగే నిన్న రూ.1,01,400 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.280 పెరిగి రూ.1,01,680 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ.100 పెరిగి తొలిసారి కిలో రూ. 1,20,100కు చేరుకుంది. కాగా నాలుగు రోజుల్లోనే 10గ్రాముల గోల్డ్ పై రూ.4100 పెరగడం గమనార్హం.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.93,200

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,680

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,200

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,680

Next Story