Today Gold Rates: షాకుల మీద షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు కూడా పెరిగిన గోల్డ్ రేట్స్..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: షాకుల మీద షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు కూడా పెరిగిన గోల్డ్ రేట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. అంతేకాకుండా 22 క్యారెట్ల గోల్డ్ రేట్స్ లక్ష దాటి రికార్డుకెక్కాయి. ఈ క్రమంలో నేడు కూడా పసిడి ధరలు పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,01,100 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.200 పెరిగి రూ.1,01,300 ఉంది. అలాగే నిన్న రూ.1,10,290 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.210.9 పైసలు పెరిగి రూ.1,10,500.90గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,40,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,10,500.90పై

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,10,500.90పై

Next Story