Today Gold Rates: భారీగా పెరిగి షాకుల మీద షాకులిస్తున్న బంగారం ధరలు.. అమ్మో అంటున్న పసిడి ప్రియులు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: భారీగా పెరిగి షాకుల మీద షాకులిస్తున్న బంగారం ధరలు.. అమ్మో అంటున్న పసిడి ప్రియులు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత ఇరవై రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈ రోజు కూడా భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,11,850 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1050 పెరిగి రూ.1,12,900గా ఉంది. అలాగే నిన్న రూ.1,22,020 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1150 పెరిగి తొలిసారి రూ.1,23,170కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.100 తగ్గి కిలో రూ.1,67,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,12,900

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,23,170

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,12,900

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,23,170

Next Story