- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: పసిడి ప్రియులకు ఎగిరిగంతేసే న్యూస్.. భారీగా తగ్గి 86వేలకు పడిపోయిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు కూడా భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.88,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.1950 తగ్గి రూ.86,100 ఉంది. అలాగే నిన్న రూ.96,060 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.2130 తగ్గి రూ.93,330 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కిలోకి రూ.1000 తగ్గి రూ. 1,08,000గా ఉంది. కాగా గత నాలుగు రోజుల్లోనే బంగారం ధరలు రూ.4750 తగ్గడం విశేషం.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.86,100
24 క్యారెట్ల బంగారం ధర - రూ.93,330
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.86,100
24 క్యారెట్ల బంగారం ధర – రూ.93,330






