Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. దీంతో పసిడి ప్రియులు అమ్మో అని అనుకుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,150గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1000 పెరిగి రూ.93,150గా ఉంది. అలాగే నిన్న రూ.1,00,530 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1090 పెరిగి రూ.1,01,620గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.2000 పెరిగి కిలో రూ.1,30,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.93,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,620

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,620

Next Story