Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,18,650 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.3050 పెరిగి రూ.1,21,700గా ఉంది. అలాగే నిన్న రూ.1,29,440 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.3330 పెరిగి రూ.1,32,770కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.3000 తగ్గి కిలో రూ.2,03,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,21,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,32,770

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,21,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,32,770

Next Story