- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేడు పెరిగిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత పదిహేను రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో హమ్మయ్య అని పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకొనేలోపే ఈరోజు మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,01,900 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.150 పెరిగి రూ.1,02,050గా ఉంది. అలాగే నిన్న రూ.1,11,170గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.160 పెరిగి రూ.1,11,330గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.2000 పెరిగి రూ.1,43,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,02,050
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,11,330
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,050
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,11,330






