Today Gold Rate: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rate: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నటి నుంచి స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా అటు పెరగకుండా ఇటు తగ్గకుండా కాంస్టాంట్‌గా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,550 ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,510 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కిలో రూ. 1,09,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.87,550

24 క్యారెట్ల బంగారం ధర - రూ.95,510

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.87,550

24 క్యారెట్ల బంగారం ధర – రూ.95,510

Next Story