Today Gold Rate: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఒక్కరోజే 2000కు పైగా తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rate: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఒక్కరోజే 2000కు పైగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఈ క్రమంలో ఈరోజు పసిడి ధరలు భారీగా తగ్గాయి. దీంతో ఈ పసిడి ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.89,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.2000 తగ్గి రూ.87,750 ఉంది. అలాగే నిన్న రూ.97,910 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.2180 తగ్గి రూ.95,730 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు 100 తగ్గి కిలో రూ. 1,08,900గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.87,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ.95,730

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.87,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ.95,730

Next Story