Today Gold Rate: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-19 05:00:25  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rate: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉంటున్న గోల్డ్ రేట్స్ ఈ రోజు మాత్రం భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.87,200 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.350 పెరిగి రూ.87,550 ఉంది. అలాగే నిన్న రూ.95,130 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.380 పెరిగి రూ.95,510 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ.1000 పెరిగి కిలో రూ. 1,09,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.87,550

24 క్యారెట్ల బంగారం ధర - రూ.95,510

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.87,550

24 క్యారెట్ల బంగారం ధర – రూ.95,510

Next Story