Today Gold Rate: అక్షయ తృతీయ నాడు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rate: అక్షయ తృతీయ నాడు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఇక ఈ రోజు అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనుగోళ్లు భారీగా జరగనుండటంతో ధరలు భారీగా పెరుగుతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా తగ్గి కాస్త ఊరటనిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.89,800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.50 తగ్గి రూ.89,750 ఉంది. అలాగే నిన్న రూ.97,970 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.60 తగ్గి రూ.97,910 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు 2000 తగ్గి కిలో రూ. 1,09,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,910

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,910

Next Story