Today Gold Rate: ఈరోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎగిరిగంతెస్తున్న పసిడి ప్రియులు

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rate: ఈరోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎగిరిగంతెస్తున్న పసిడి ప్రియులు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఈ క్రమంలో ఈరోజు పసిడి ధరలు భారీగా తగ్గాయి. దీంతో ఈ పసిడి ప్రియులు ఎగిరిగంతేస్తున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.87,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.200 తగ్గి రూ.87,550 ఉంది. అలాగే నిన్న రూ.95,730 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.220 తగ్గి రూ.95,510 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు 2000 పెరిగి కిలో రూ. 1,09,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.87,550

24 క్యారెట్ల బంగారం ధర - రూ.95,510

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.87,550

24 క్యారెట్ల బంగారం ధర – రూ.95,510

Next Story