- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TODAY GOLD RATES: మగువలకు షాక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?
బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తులం లక్ష రూపాయలు దాటిన బంగారం ధర పైపైకి వెళుతోంది. తాజాగా మంగళవారం మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారం పదిగ్రాములపై ఏకంగా రూ.2,500 పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తులం లక్ష రూపాయలు దాటిన బంగారం ధర పైపైకి వెళుతోంది. తాజాగా మంగళవారం మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారం పదిగ్రాములపై ఏకంగా రూ.2,500 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,26,280గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,250 మేర పెరిగి రూ.1,15,750కి చేరుకుంది.
ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,280గా ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,750గా ఉంది. పసిడి ధరలతో పాటు వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. మంగళవారం కిలో వెండిపై రూ.3వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,60,000గా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,70,000లుగా ఉంది. మరోవైపు విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.1,26,280గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,15,750గా ఉంది. అదే విధంగా కిలో వెండి ధర రూ.1,70,000లుగా ఉంది.






