Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-16 11:02:50  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది.

Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో భారీగా పెరిగి తులం 95వేల వరకు వచ్చింది, కానీ గత మూడు రోజుల నుంచి గోల్డ్ ధరలు తగ్గు ముఖం కనబడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో గోల్డ్ కొనడానికి ప్రజలు బంగారం షాపులకు పరుగులు పెడుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.600 కు తగ్గి రూ.82,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.650 కు తగ్గి రూ.89,730 గా ఉంది. ఇక వెండి ధర కిలో రూ. 1,03,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.82,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.89,730

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.82,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.89,730

Next Story