Economy: 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి 12 శాతం వృద్ధి అవసరం

by S Gopi |

స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరం నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలదని అభిప్రాయపడ్డారు.

Economy: 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి 12 శాతం వృద్ధి అవసరం
X

దిశ, బిజినెస్ బ్యూరో: సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక పరిశోధనలకు సంబంధించిన సవాళ్లను భారత్ అధిగమించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అన్నారు. అలా చేయగలిగితే స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరం నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలదని అభిప్రాయపడ్డారు. గురువారం ఐఐటీ మద్రాస్ 67వ ఇన్‌స్టిట్యూట్ డే వేడుకల్లో మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఉద్రిక్త భౌగోళిక రాజకీయ వాతావరణంలో ఈ లక్ష్యం సాధించేందుకు లోతైన అవగాహన అవసరం. ప్రస్తుతం భారత జీడీపీ 3.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. రాబోయే ఆరేళ్లలో ఇది 7.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లను అందుకోవాలంటే భారత్ ఏటా 12 శాతం వృద్ధి రేటును సాధించాలని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం సైన్స్, ఇంజనీరింగ్‌లో సరికొత్త పరిశోధనలు కావాలి. దేశీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ప్రపంచ స్థాయి నాలెడ్జ్‌లో కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర దేశాల సాంకేతికతను స్వీకరించి, దానిని భారతీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, పైలట్ ప్రాజెక్టుల నుంచి పేటెంట్ల దిశగా ప్రయత్నాలను వేగవంతం చేయాలని సూచించారు.

Next Story