KVS: కేంద్రీయ విద్యాలయా స్కూల్స్ లో పిల్లలకు సీటు కావాలా...అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు..!!

by Vennela |

KVS: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదివేందుకు విద్యార్థులను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది.

KVS: కేంద్రీయ విద్యాలయా స్కూల్స్ లో పిల్లలకు సీటు కావాలా...అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు..!!
X

దిశ, వెబ్ డెస్క్: KVS: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదివేందుకు విద్యార్థులను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. సిబిఎస్ఈ మాధ్యమంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ స్కూళ్లలో పాఠశాల విద్య కొనసాగుతుంది.

నాణ్యమైన ఉన్నతమైన విద్య కోసం సీబీఎస్ఈ విద్య కోసం కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ పెట్టింది పేరుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రీయ విద్యా స్కూల్లో మీ పిల్లలను చదివించాలని ఉందా అయితే దానికి దారి తీసే మార్గం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో సీటు కోసం ఒకటో క్లాసు నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. kvsonlineadmission.kvs.gov.in వెబ్ సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలు సీటు పొందేందుకు అర్హులుగా ఉంటారు.

9వ తరగతిలో కూడా కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు తీసుకుంటారు. దీనికోసం ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సామాజిక శాస్త్రాలపై 3 గంటల పరీక్ష ఉంటుంది. 11వ తరగతిలో కూడా కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సైన్స్, కామర్స్, హ్యూమానిటీస్ స్ట్రీమ్స్‌లో ప్రవేశం లభిస్తుంది.

కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో రిజర్వేషన్ విధానం అమలులో ఉంది. ఎస్సీ (SC) 15% సీట్లు, ఎస్టీ (ST): 7.5% సీట్లు, ఓబీసీ-నాన్ క్రీమీ లేయర్ (OBC-NCL): 27% సీట్లు, రైట్ టు ఎడ్యుకేషన్ (RTE): 25% సీట్లు (ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, EWS, BPL, దివ్యాంగ విద్యార్థులు అర్హులు), దివ్యాంగ విద్యార్థులు (CwSN): 3% సీట్లు కేటాయిస్తారు. ఒక్కో తరగతికి 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం https://kvsangathan.nic.in/en/admission-guidelines/ లింకును ప్రెస్ చేసి తెలుసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు కేవలం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పిల్లలకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రవేశానికి అర్హత ఉంది. దీనికి సంబంధించిన రిజర్వేషన్, ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత పొందవచ్చు.

Next Story