ఇది 'గూగుల్ పే' గురూ! పేమెంట్ యాప్ లో ఇప్పుడు సరికొత్త ఫీచర్లు

by Geesa Chandu |   (  Updated:2024-08-31 15:48:06  IST  )

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్.. గూగుల్ పే(Google Pay) ఇప్పుడు సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఇది గూగుల్ పే గురూ! పేమెంట్ యాప్ లో ఇప్పుడు సరికొత్త ఫీచర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్.. గూగుల్ పే(Google Pay) ఇప్పుడు సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చింది. గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్(జీఎఫ్ఎఫ్) 2024 సందర్భంగా.. యూపీఐ సర్కిల్, యూపీఐ వోచర్, క్లిక్ పే లాంటి మూడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్లు ఈ ఏడాది చివరి నాటికి ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ కొత్త ఫీచర్ల వలన కలిగే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం..

'గూగుల్ పే' నయా ఫీచర్స్ ఇవే...

  • UPI సర్కిల్:

యూపీఐ సర్కిల్ అనేది NPCI ప్రవేశ పెట్టిన కొత్త ఫీచర్. గూగుల్ పే వినియోగదారులు(ప్రైమరీ యూజర్స్) ఈ యూపీఐ సర్కిల్ తో.. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా అనుమతించవచ్చు. అంటే, బ్యాంక్ ఖాతాలు లేని కుటుంబ సభ్యులు చెల్లింపులు చేయాల్సి వస్తే, ప్రైమరీ యూజర్ అకౌంట్(Google pay లింక్డ్ ఖాతా) ద్వారా చెల్లింపులు జరుపుకోవచ్చు.

  • UPI వోచర్స్( ఈ-రూపీ):

యూపీఐ వోచర్లు లేదా eRupi అనేది.. కోవిడ్ సమయంలో ప్రారంభించబడిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ(DBT) ఫీచర్. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రస్తుత యూపీఐ వినియోగదారులు వీటిని జారీ చేయవచ్చు. దీని ద్వారా కస్టమర్స్ తమ బ్యాంక్ ఖాతాను, యూపీఐకి లింక్ చేయకుండానే.. మొబైల్ నంబర్ కు లింక్ చేయబడిన ప్రీపెయిడ్ వోచర్ ను రూపొందించవచ్చు.

  • Click Pay QR scan(క్లిక్ పే క్యూఆర్ స్కాన్):

ప్రీపెయిడ్ యుటిలిటీ బిల్లు చెల్లింపులు చేయడానికి ఈ ఫీచర్ ను తీసుకొస్తుంది. QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా వినియోగదారులు బిల్లులు చెల్లించవచ్చు. అచ్చం పేటీఎం లో ఉన్న ఫీచర్ లాగానే.. వినియోగదారు తమ కస్టమర్ డేటాను యాప్ కు జోడించిన తర్వాత వారి ప్రీపెయిడ్ యుటిలిటీ బిల్లులను గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట.

దీంతో పాటు రూపే కార్డుదారుల కోసం ట్యాప్ అండ్ పే చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించింది. ఈ పేమెంట్స్ కొరకు రూపే కార్డుదారులు తమ మొబైల్ ఫోన్లను కార్డులతో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ కూడా ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది. చివరగా.. మరొక UPI లైట్ ఆటోపే ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. ఇది ఖాతాలో బ్యాలెన్స్ నిర్ధిష్ట మొత్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు, వినియోగదారులు వారి యూపీఐ లైట్ ఖాతాను ఆటోమేటిక్ గా టాప్ అప్ చేయడానికి అనుమతిస్తుంది.

Next Story