- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు.. ఈ వస్తువుల ధరలు ఇకపై మరింత చౌక!
జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. 5, 18 శ్లాబులు అమల్లోకి వస్తే అనేక వస్తువుల ధరల తగ్గనున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో కేంద్రం కీలకమైన సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న 12, 28 శాతం శ్లాబ్ ల జీఎస్టీలకు స్వస్తి పలికి.. వాటి స్థానంలో 5,18 శ్లాబులను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త జీఎస్టీ శ్లాబుల్ని దీపావళికి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ శ్లాబులు అమల్లోకి వస్తే.. అనేక నిత్యావసర, హోమ్ అప్లైయెన్స్, దుస్తులు, చెప్పులు ధరలు తగ్గనున్నాయి.
తగ్గనున్న వస్తువుల ధరల్లో.. ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, కార్లు, మోటార్ సైకిల్ సీట్లు, సైకిల్స్, అగ్రికల్చర్ ఫీల్డ్ కు వాడే వాహనాలకు రబ్బర్ టైర్లు, ప్లాస్టర్, సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రీట్, అల్యూమినియం, స్టీల్ తో తయారు చేసిన వంటపాత్రలు, నాన్ కిరోసిన్ స్టవ్ లు, టాంపర్డ్ గ్లాస్, అల్యూమినియం ఫాయిల్, రేజర్లు, ప్రింటర్లు, మ్యానిక్యూ, పెడిక్యూర్ కిట్లు ధరలు తగ్గనున్నాయి.
అలాగే టూత్ పేస్ట్, టూత్ పౌడర్, హెయిర్ ఆయిల్, సబ్బులు, గొడుగులు, కుట్టు మెషీన్లు, ప్రాసెస్డ్ ఫుడ్, కండెన్స్డ్ మిల్క్, కోల్డ్ వెజిటెబుల్స్, ప్రెజర్ కుక్కర్లు, వాటర్ ఫిల్టర్స్, నాన్ ఎలక్ట్రానిక్ ప్యూరిఫయర్లు, ఎలక్ట్రానిక్ ఐరన్స్, కంప్యూటర్లు, గీజర్లు, నాన్ కమర్షియర్ వాక్యూమ్ క్లీనర్లు, రెడీమేడ్ డ్రస్సులు, రూ.500-1000 లోపు చెప్పులు, అనేక రకాల వ్యాక్సిన్లు, హెచ్ఐవీ, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్లు, ఆయుర్వేదం మందులు ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
జామెట్రీ బాక్సులు, మ్యాప్‌లు, గ్లోబులు, సోలార్ వాటర్ హీటర్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, షుగర్ సిరప్‌లు, అరోమా కాఫీ, కాఫీ ఉత్పత్తులు వంటి ధరలు కూడా తగ్గనున్నాయి. ఈ వస్తువులు, మందుల ధరలన్నీ తగ్గితే మధ్యతరగతి వారికి భారీ ఊరట లభిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.






