Fd Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్ పై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే

by Bhoopathi Nagaiah |

Fd Interest Rates: ఫిక్స్ డిపాజిట్(fixed Deposite) పై అత్యధిక వడ్డీ రేట్లు(Highest interest rates) ఇస్తున్న బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Fd Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్ పై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: చేతిలో డబ్బులు ఉంటే కొంతమంది బంగారం(Gold) కొనుగోలు చేస్తారు. మరి కొందరు రియల్ ఎస్టేట్(Real Easte) మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) లేదా స్టాక్ మార్కెట్లో (stock Market)పెట్టుబడులు పెడతారు. ఇలా ఎన్నో పెట్టుబడి సాధనాలు ఉన్నా.. చాలా మంది చూపు మాత్రం ఫిక్స్ డిపాజిట్ (fixed Deposite) పైకే వెళుతుంది. అయితే పెట్టుబడి సాధనాలు ఎన్ని ఉన్నా ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి వస్తుందని చాలామంది ఫిక్స్ డిపాజిట్ల పైనే ఆసక్తి చూపిస్తుంటారు. రిస్క్ కు దూరంగా ఉండేందుకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల(Senior citizens)కు మెరుగైన రాబడి ఎంపికగా కొనసాగుతున్నాయి. సాధారణ డిపాజిటర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు(Senior citizens) 0.5 0% వరకు అదనపు వడ్డీ రేటు(Additional interest rate)ను పొందవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా సీనియర్ సిటిజన్లు తమ బ్యాంక్ పెట్టుబడి(Bank investment) మొత్తాన్ని రక్షించుకునేందుకు ఎఫ్డీలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. అదే సమయంలో బ్యాంకులు కూడా ఎఫ్డీ లపై ఆకర్షణమైన వడ్డీరేట్లు అందిస్తుంటాయి.

బ్యాంకుల వడ్డీ రేట్లలో పెద్దగా వ్యత్యాసం లేనప్పటికీ 10- 20 బేసిక్ పాయింట్ల చిన్న తేడా మొత్తం రాబడిలో గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు రూ.10 లక్షల ఎడ్డీ పై 20 బేసిస్ పాయింట్ల వ్యత్యాసంతో సంవత్సరంలో రూ.2వేల అదనపు వడ్డీ(Additional interest) లభిస్తుంది. మీరు ఈ డబ్బును మూడేళ్ల పాటు అలాగే ఉంచితే ఈ అదనపు ఆదా అనేది రూ. 6000కు పెరుగుతుంది. డిపాజిట్ మరో రూ. 10 లక్షలు పెరిగితే మొత్తం పొదుపు రూ.12 వేల వరకు పెరుగుతుంది. దీనికి కారణం అదనంగా లభించే 20 బేసిస్ పాయింట్ల వడ్డీ(Basis points interest) మాత్రమే అని చెప్పవచ్చు. అందుకే బ్యాంకుల్లో ఎవరైనా ఎఫ్డి లు చేసే ముందు వడ్డీ రేట్లను సరి పోల్చుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎఫ్డీ లపై అత్యధిక వడ్డీ రేట్లు(Highest interest rates on FDs) అందిస్తున్న బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

-హెచ్ డిఎఫ్ సీ (HDFC) బ్యాంక్ సాధారణ పౌరులకు, సీనియర్ సిటిజనులకు ఐదేళ్ల ఫిక్స్ డిపాజిట్ లపై 7శాతం నుంచి 7.5శాతం వడ్డీని అందిస్తుంది.

- ఐసిఐసిఐ(ICICI) బ్యాంక్ కూడా పదేళ్ల డిపాజిట్లపై అదే వడ్డీ రేటును అందిస్తుంది.

- యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) తన ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై సాధారణ సీనియర్ సిటిజన్లకు 7శాతం, 7.75శాతం వడ్డీ రేటు అందిస్తుంది.

- యెస్ బ్యాంక్ (Yes Bank) సాధారణ పౌరులకు 7.25 శాతం సీనియర్ సిటిజన్లకు 8శాతం వడ్డీ రేటు అందిస్తుంది.

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఐదేళ్ల కు ఎఫ్టీ లపై సాధారణ పౌరులకు 6.5శాతం సీనియర్ సిటిజన్లకు 7.5శాతం వడ్డీ రేటు అందిస్తుంది.

-పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సాధారణ పౌరులకి రెగ్యులర్ వడ్డీ రేటు 6.5శాతం సీనియర్ సిటిజన్లకు 7 శాతం అందిస్తుంది.

Next Story