ఎక్కువ మైలేజీ ఇచ్చే స్పోర్ట్స్ బైక్స్ ఇవే..ధర, వివరాలు ఇవే ?

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్లో అనేక రకాల బైక్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మైలేజ్ ఎక్కువ ఇచ్చే బైక్ లకు జనాల నుంచి ఆదరణ

ఎక్కువ మైలేజీ ఇచ్చే స్పోర్ట్స్ బైక్స్ ఇవే..ధర, వివరాలు ఇవే  ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ మార్కెట్లో అనేక రకాల బైక్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మైలేజ్ ఎక్కువ ఇచ్చే బైక్ లకు జనాల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇక.. అదే సమయంలో స్పోర్ట్స్ బైక్స్ కూడా... జనాలు ఆసక్తిగా కొంటున్నారు. ఈ స్పోర్ట్స్ బైక్ లలో కూడా... మైలేజ్ ఎక్కువ ఇచ్చేవి కూడా ఉన్నాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే... కేటీఎం ఆర్ సి 200.. ఈ బైక్ ఒక్క లీటర్ కు 35 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ధర 2.54 లక్షల వరకు ఉంటుంది.

యమహా R 15 వీ 4... ఈ బైక్ కూడా మార్కెట్లో బాగా విక్రయాలు జరుపుకుంటుంది. ఇక ఈ బైక్ ధర 1.89 లక్షలు మాత్రమే ఉంది. ఈ బైక్ లీటర్కు 45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200.. ఈ కంపెనీ బైక్స్ కూడా.. జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ బజాజ్ పల్సర్ బైక్ లీటర్ కు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ధర వచ్చేసి 1.85 లక్షల వరకు ఉంటుంది. BMW G310 RR బైకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ బైక్ లీడర్ కు 31 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ధర 3.5 లక్షలుగా ఉంది.

Next Story