- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG Gas Price Today(February 03): నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే!
అంతర్జాతీయ చమురు ధరల ప్రభావంతో ఎల్పీజీ రేట్లు మారుతుంటాయి. బడ్జెట్‌కు ముందు రోజు వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో వినియోగదారులకు షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి మరికొన్ని గంటల సమయం ఉందనగా, సామాన్యుడిపై ధరల భారం పడింది. ప్రతి నెలా ఒకటో తేదీన ధరలు సవరించే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. ఈ నెల(ఫిబ్రవరి) 1వ తేదీన ఎల్‌పీజీ (LPG) వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.
కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా సవరణ ప్రకారం.. 19 కేజీల వాణిజ్య (Commercial) సిలిండర్ ధర పై రూ.50 పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1740.50 కి చేరుకుంది. అయితే గృహ వినియోగ (Domestic) LPG సిలిండర్ల ధరల్లో మాత్రం ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. కాగా, బడ్జెట్ వేళ వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై అదనపు భారం పడిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ(ఫిబ్రవరి 03) గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్: రూ.905
వరంగల్: రూ.924
విశాఖపట్నం: రూ.861
విజయవాడ: రూ.875
గుంటూరు: రూ. 877






