మహిళల కోసం లోన్స్‌పై ప్రత్యేక రాయితీని ఇస్తున్న బ్యాంకులు ఇవే!

by Disha Web Desk 17 |
మహిళల కోసం లోన్స్‌పై ప్రత్యేక రాయితీని ఇస్తున్న బ్యాంకులు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు పెట్టుబడి రంగాల్లో దూసుకుపోతున్నారు. రియల్ ఎస్టేట్‌ రంగం నుంచి మొదలుకుని ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుని గృహాలు నిర్మించుకోవడం, వివిధ కంపెనీలు స్థాపించడం మొదలగు వాటిలో మహిళలు ఇన్వెస్ట్ చేసి మంచి ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రభుత్వం కూడా వీరికి ప్రోత్సాహకరంగా ఉండటానికి తక్కువ వడ్డీ రేటు, స్టాంప్ డ్యూటీపై 1 శాతం నుండి 2 శాతం వరకు తగ్గింపులను అందిస్తోంది.

మహిళలకు వివిధ బ్యాంకులు ఏ వడ్డీ రేటు ప్రకారం లోన్స్ ఇస్తున్నాయో ఒకసారి చూద్దాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI): గృహ రుణాలు తీసుకోవాలనుకునే మహిళలకు ఈ బ్యాంకు ప్రత్యేకంగా 5 బేసిస్ పాయింట్ల రాయితీని అందిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా మహిళలకు వడ్డీ రేటు 9.15 నుండి 10.15% వరకు ఉంటుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: దీనిలో లోన్ తీసుకునే మహిళలకు 5bps రాయితీని ఇస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, వడ్డీ రేటులో 0.05% రాయితీ లభిస్తుంది.

HDFC: హెచ్‌డిఎఫ్‌సి మహిళా రుణగ్రహీతలకు గృహ రుణాలపై 5 బేసిస్ పాయింట్ల తగ్గింపును అందిస్తుంది. వారికి వడ్డీ రేటు 8.95% నుండి ప్రారంభమవుతుంది. అదే విధంగా, క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తాన్ని బట్టి 9.85% వరకు ఉండవచ్చు.

కెనరా బ్యాంక్: ఈ బ్యాంకులో లోన్ తీసుకునే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.85% నుండి ప్రారంభమవుతాయి. అసలు వడ్డీ పై 5 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది.

వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించడానికి స్టాంపు డ్యూటీ పై రాయితీ ఇస్తుంది. కొన్ని రాష్ట్రాలు వివిధ ఆస్తులను కొనుగోలు చేసే స్త్రీలకు స్టాంప్ డ్యూటీలో 1% నుండి 2% తగ్గింపును ఇస్తున్నాయి. అలాగే, లోన్స్‌పై వడ్డీ చెల్లింపుల సమయంలో పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.

Also Read...

మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు!



Next Story

Most Viewed