- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 గ్రాముల బంగారం ధర అక్షరాలా రూ.లక్ష
బంగారం ప్రియులను గతకొన్ని రోజులుగా కంటిమీద కునుకు చేస్తున్న ధరలు మరోసారి షాకిచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం(Gold) ప్రియులను గతకొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ధరలు మరోసారి షాకిచ్చాయి. లైవ్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలను తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 3500 డాలర్లకు ఔన్స్ బంగారం ధర చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌లో మాత్రం రూ.99860గా కొనసాగుతోంది. రేపు ఉదయం మార్కెట్‌లో లక్ష దాటనున్నట్లు సమాచారం.
కాగా, అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు కారణంగా ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. డాలర్ బలహీన పడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూ వస్తోంది. దీని కారణంగా దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.99,600 పైనే ఉండగా.. సాయంత్రానికి రూ.లక్షకు చేరింది. అటు వెండి కూడా కిలో రూ.98 వేలుగా ఉంది.






