New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను బిల్లులోని 10 ముఖ్యమైన విషయాలు ఇవే.. తప్పక చదవండి!

by Vennela |

New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను చట్టం త్వరలోనే అమల్లోకి రాబోతోంది.

New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను బిల్లులోని 10 ముఖ్యమైన విషయాలు ఇవే.. తప్పక చదవండి!
X

దిశ, వెబ్ డెస్క్ : New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను చట్టం (New Income Tax Bill)త్వరలోనే అమల్లోకి రాబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం కొత్త బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా బిల్లు సరళంగా, సులభంగా అర్ధం చేసుకునేలా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొత్త చట్టంలోని కఠిన పదజాలం లేదని..నిబంధనలు అర్థం చేసుకోవడం సులభంగా ఉందని తెలిపారు. ఇందులో కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్. కాబట్టి పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులు కొత్త విధానం నుంచి తప్పుకోవాలని ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ చిరాగ్ చౌహాన్ తెలిపారు.

కాగా ఆదాయపు పన్ను చట్టాలను సరళీకృతం చేసే లక్ష్యంతో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) ఫిబ్రవరి 1, 2025న తన బడ్జెట్ ప్రసంగంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇది చట్టంగా మారిన తర్వాత, ఈ బిల్లు ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలోకి వస్తుంది. మునుపటి చట్టం కాలక్రమేణా.. వివిధ సవరణల తర్వాత చాలా క్లిష్టంగా మారింది. కొత్త చట్టంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

1. తక్కువ పేజీలు :

2024లో సవరించిన ఆదాయపు పన్ను చట్టం 1961లో 823 పేజీలు ఉన్నాయి. కొత్త ఆదాయపు పన్ను బిల్లులో 622 పేజీలు ఉన్నాయి. కాబట్టి ఇది 201 పేజీలతో చిన్నది.

2. విభాగాల సంఖ్య

ఈ బిల్లులో 536 సెక్షన్లు, 23 చాప్టర్లు 16 షెడ్యూల్లు ఉన్నాయి. ఎక్కువ విభాగాలు ఉన్నప్పటికీ తక్కువ వివరణతోపాటు నిబంధనలు ఉన్నాయి.

3. స్టాండింగ్ కమిటీ

ఇది పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత దీనిని ఆర్థిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. తర్వాత ఇది సంబంధిత వ్యక్తులు, స సంస్థలతో సంప్రదింపులను ప్రారంభిస్తుంది.

4. ట్యాక్స్ ఆడిట్

కొత్తగా నిర్ణయించిన ఆదాయపన్ను పరిమితి కింద ఒక పరిధి ఉంటుంది. ఇప్పుడు ఈ శ్రేణి మధ్య పన్ను ఆడిట్ వర్తిస్తుంది.

5. పరిమితులు పెంపు

వ్యాపారానికి 44ఏఏడీ పరిమితిని రూ.2కోట్ల నుంచి 3కోట్లకు ప్రొఫెషనల్స్ కు రూ.50లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు పెంచారు.

6. చివరి తేదీలు

ట్యాక్స్ ఆడిట్ ఫైలింగ్ తేదీని సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31 వరక పన్ను ఆదాయ పన్ను ఫైలింగ్ చివరి తేదీని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించారు.

7. సీఏల ఆడిట్

పన్ను ఆడిట్ పరిధిని సీఎస్, సీఎంఏలకు కూడా విస్తరిస్తారని గతంలో పలు ఊహాగానాలు వచ్చాయి. కానీ సెక్షన్ 515(3) బి ప్రకారం అకౌంటెంట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అని అర్థం.దీంతో సీఎ కమ్యూనిటీకి ఊరట లభించింది.

8. పన్ను సంవత్సరం

ప్రీవియస్ ఇయర్ , అసెస్మెంట్ ఇయర్ అనే భావనకు భిన్నంగా ఇప్పుడు దీనిని సింపుల్ గా ట్యాక్స్ ఇయర్ లేదా పన్ను ఏడాదిగా పిలుస్తారు.

9. క్యాపిటల్ గెయిన్

లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గత ఏడాది మాదిరిగానే ఉన్నాయి.

10. డిజిటల్ లావాదేవీలు

రూ. 10కోట్ల టర్నోవర్ వరకు ఆడిట్ రిలీఫ్ తో డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం ఉంది.

Next Story