- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ratan Tata: రతన్ టాటా వీలునామాలో 'మిస్టరీ మ్యాన్'కు రూ. 500 కోట్లు
ఆయన ఆస్తిలో వందల కోట్లను ఓ 'మిస్టరీ మ్యాన్ 'కు కూడా పంచారనే విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా తనకున్న వేలాది కోట్ల ఆస్తి నుంచి పనివాళ్లకు, పెంపుడు జంతువులకు కూడా పంచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే, తాజాగా బయటకొచ్చిన ఆయన వీలునామాలో ఓ వ్యక్తికి రూ. 500 కోట్ల విలువైన ఆస్తులను ఇచ్చారు. ఆయన ఆస్తిలో వందల కోట్లను ఓ 'మిస్టరీ మ్యాన్ 'కు కూడా పంచారనే విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతేడాది అక్టోబర్ 9న మరణించిన రతన్ టాటా, కుటుంబసభ్యులతో పాటు సన్నిహితులకు పెద్దగా తెలియని మోహినీ మోహన్ దత్తాకు ఆస్తులు బదిలీ చేశారు. రతన్ టాటా తన ఆస్తికి వారసులలో ఒకరిగా మోహినీ మోహన్ దత్తాను వీలునామాలో పేర్కొన్నప్పటికీ, అంతర్గత ప్రక్రియ, హైకోర్టు ద్వారా ధృవీకరించిన తర్వాత మాత్రమే పంపిణీ చేయబడుతుంది. దీనికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
ఎవరీ మోహినీ మోహన్ దత్తా..
మోహినీ మోహన్ దత్తా జంషెడ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త. ట్రావెల్స్ కంపెనీ స్టాలియన్‌కు కో-ఫౌండర్. తర్వాతి కాలంలో ఈ కంపెనీ టాటా సర్వీసెస్‌లో విలీనమైంది. విలీనానికి ముందు, మోహినీ మోహన్ దత్తాకు స్టాలియన్‌లో 80 శాతం వాటా ఉండగా, టాటా ఇండస్ట్రీస్ మిగిలిన 20 శాతం వాటాను కలిగి ఉంది. రతన్ టాటాతో మోహినీ మోహన్ దత్తాకు ఆరు దశాబ్దాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. టాటాను 24 ఏళ్ల వయసులో తాను కలిశానని మోహన్ దత్తా పలు సందర్భాల్లో చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది రతన్ టాటాయేనని ఆయన చెప్పారు. మోహన్ దత్తాకు చెందిన స్టాలియన్ టావెల్ ఏజెన్సీ 2013 నుంచి టాటా యాజమాన్యంలోని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌తో కలిసి పనిచేస్తోంది. మోహన్ దత్తా టాటాకు సన్నిహితుడిగానే కాకుండా నమ్మకమైన, విశ్వాసపాత్రుడిగా కూడా కొనసాగారు. మోహన్ దత్తా తనని తాను టాటా దత్తపుత్రుడిగా చెప్పుకున్నారని టాటా సన్నిహితులు వెల్లడించారు. కాగా, రతన్ టాటా మరణానంతరం బయటకు వచ్చిన వీలునామాలో తన వద్ద ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న వ్యక్తిగత సహాయకులకు, పెంపుడు శునకానికి ఆస్తులను పంచారనే సంగతి తెలిసిందే.






